News October 4, 2025

చిన్నారులు గాయపడటంపై CM ఆవేదన

image

AP: విశాఖ సీతంపేటలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గంజి పడి ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. చిన్నారులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 20 మంది చిన్నారులకు గాయాలవ్వగా వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని కలెక్టర్ తెలిపారు.

Similar News

News March 21, 2026

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోంది: బండి సంజయ్

image

తెలంగాణ మరో శ్రీలంక కాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇది ప్రజలను వంచించే బడ్జెట్ అని, అంకెల ఆర్భాటాలు తప్ప ఒరిగేదేమీ లేదని మీడియాతో అన్నారు. 6 గ్యారంటీలను గాలికి వదిలేశారని ఫైరయ్యారు. ‘డ్రగ్స్ కేసులో సీఎంకు చిత్తశుద్ధి లేదు. ఫార్ములా ఈ, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే’ అని ఆరోపించారు.

News March 21, 2026

నేడు, రేపు వర్షాలు: APSDMA

image

AP: బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నేడు, రేపు వానలు పడతాయని APSDMA తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రేపు విజయనగరం, VZG, అనకాపల్లి, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, ATP, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని హెచ్చరించింది. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

News March 21, 2026

గ్యాస్ బుకింగ్స్ తగ్గాయి: కేంద్రం

image

దేశవ్యాప్తంగా పానిక్ బుకింగ్స్ తగ్గాయని కేంద్రం తెలిపింది. అవసరమైనంత మేర నిల్వలు ఉన్నాయని చెప్పింది. ‘గ్యాస్ బుకింగ్స్ 89 లక్షల నుంచి 55 లక్షలకు తగ్గాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటల్లో 4 వేల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. కొత్తగా 13,700 PNG కనెక్షన్లు జారీ చేశాం. ప్రజలు PNG, ఎలక్ట్రిక్/ఇండక్షన్ స్టవ్స్‌ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలకు మళ్లాలి’ అని సూచించింది.