News October 4, 2025

‘ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయి నివేదిక సమర్పించాలి’

image

ఇసుక తవ్వకాలపై జిల్లా స్థాయి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గల సాంకేతిక శాఖలైన నీటిపారుదల, భూగర్భజల, గనులు, భూగర్భశాఖ, ప్రాజెక్ట్ ఆఫీసర్, TSMDC, ఫారెస్ట్, రెవెన్యూ, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ వారి కార్యాలయాలను ఆదేశించారు. ఈ నివేదిక జిల్లా వెబ్ సైట్ https://kothagudem.telangana.gov.in లో ప్రజల సమాచారం కోసం పొందుపర్చాలని తెలిపారు.

Similar News

News March 11, 2026

సిద్దిపేట: మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ అసహనం

image

కోహెడ మండలం శనిగరంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ కె. హైమావతి బుధవారం సందర్శించారు. మధ్యాహ్న భోజనంలో పప్పు పలుచగా ఉండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం తంగళ్లపల్లి కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని సందర్శించి, విద్యార్థుల భోజనం, వసతి, చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

News March 11, 2026

KNR: ‘డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్‌కు దూరంగా ఉండాలి’

image

డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి అలవాట్లు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, అడిషనల్ డీసీపీ వేంకటరమణ తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన కరపత్రాన్ని వారు KNRలో ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ తదితరులు ఉన్నారు.

News March 11, 2026

BED ప్రయోగ పరీక్షలపై ANU నిఘా

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ BED మొదటి విడత ప్రయోగ పరీక్షలపై గట్టి నిఘా వేసింది. దీంతో ఎగ్జామినర్ల గైర్హాజర్‌తో ప్రారంభం కాని బోర్డుల సమాచారం వెంటనే వర్సిటీకి తెలిసిపోతుంది. ANU పరిధిలో BED మొదటి విడత ప్రయోగ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. సమన్వయకర్త సుబ్బారావు గుంటూరులోని సిమ్స్, హిందూ, ఏఎల్ BED కళాశాలల విద్యార్థులకు జరిగే ప్రయోగ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.