News October 4, 2025

ఎమ్మెల్యే దొంతికి మాతృ వియోగం

image

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం కలిగింది. మాధవరెడ్డి తల్లి కాంతమ్మ అనారోగ్యంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ప్రజల సందర్శనార్థం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఆమె పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. ఆదివారం మధ్యాహ్నం హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద అంత్యక్రియలు జరపనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.

Similar News

News March 17, 2026

బిల్లులో గ్యాస్ ఛార్జ్.. రూల్స్ ఏం చెబుతున్నాయి?

image

హోటల్ బిల్లులో ఫుడ్ ప్రైస్, GST తప్ప మరే ఇతర ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదని వినియోగదారుల రక్షణ చట్టం (2019) చెబుతోంది. ఇటీవల ‘గ్యాస్ క్రైసిస్ ఛార్జ్’ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్వీస్ ఛార్జ్ అయినా, మరే ఇతర పేరుతో అయినా కస్టమర్ అనుమతి లేకుండా ఎక్స్‌ట్రా డబ్బులు అడగొద్దు. పెరిగిన ఖర్చులను మెనూ ధరల్లో చూపించాలే తప్ప విడిగా యాడ్ చేయడం రూల్స్‌కు విరుద్ధం.

News March 17, 2026

NGKL: విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడి మృతి

image

వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్వహిందూ పరిషత్ నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర్ రెడ్డి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కల్వకుర్తి మండలంలోని మార్చాల గ్రామానికి చెందిన ఆయన కల్వకుర్తిలో నివాసం ఉంటున్నారు. కారు బొలెరో ఢీకొన్న సంఘటనలో ఈ ప్రమాదం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News March 17, 2026

30 రోజులు రేణిగుంట రైల్వే బ్రిడ్జ్ క్లోజ్

image

రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఆర్డీవో భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 50ఏళ్ల కాలం నాటి బ్రిడ్జ్‌ కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్, సంత మార్కెట్ రోడ్డు మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు అధికంగా వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.