News October 4, 2025
ములుగు: సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్

సోమవారం నిర్వహించే ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి ఉండదన్నారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజలంతా గమనించి సహకరించాలని ఆయన కోరారు.
Similar News
News March 6, 2026
గుంటూరు: ఈ నెల 13 నుంచి HPV వ్యాక్సినేషన్

గుంటూరు జిల్లాలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్‌ను మార్చి 13 నుంచి ప్రారంభించనున్నట్లు DMHO విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 14,167 మంది అర్హులను గుర్తించామని, PHCలు, CHCలు, GGHలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. 90 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో బాలికలందరికీ టీకా వేయించాలని ఆమె కోరారు.
News March 6, 2026
లిక్కర్ స్కామ్.. రూ.441 కోట్ల ఆస్తులు అటాచ్

AP: లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు కసిరెడ్డి, వాసుదేవ రెడ్డి, చాణక్యకు చెందిన రూ.441 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2019 తర్వాత లిక్కర్ పాలసీలో మార్పులు చేసి పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని పేర్కొంది. ఫేవర్ బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించింది. కమీషన్ ఇవ్వని కంపెనీలకు సప్లై ఆర్డర్లు నిలిపివేశారని వివరించింది.
News March 6, 2026
ICC టోర్నీల్లో 15వ సారి ఫైనల్‌కు.. గెలుస్తుందా?

టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. 1983లో కపిల్ దేవ్ ప్రారంభించిన విజయ పరంపరను గంగూలీ, ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మల అడుగుజాడల్లో సూర్య బృందం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తోంది. ఐసీసీ టోర్నీల చరిత్రలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 15వ సారి. WC, CT, WTCలలో మన జట్టు నిలకడైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఎల్లుండి న్యూజిలాండ్‌తో జరగనున్న ఫైనల్ పోరులో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.


