News October 4, 2025
ప్రకాశం జిల్లాలో ఉపాధి శ్రమికులకు బిగ్ అలర్ట్

ప్రకాశం జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ శనివారం కీలక సూచన చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా పని కోరే ప్రతి శ్రామికుడు ఈ-కేవైసి చేయించుకోవాలని తెలిపింది. నవంబర్ 7లోగా ఉపాధి శ్రమికులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకొని, పని పొందటంలో ఎలాంటి ఇబ్బంది పడవద్దని సంబంధిత అధికారులు సూచించారు. అన్ని గ్రామాల్లో నిర్వహించే ఈ కేవైసీ ప్రక్రియ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.
Similar News
News October 5, 2025
అవార్డులకు వేళాయే.. కీలక ప్రకటన చేసిన ప్రకాశం కలెక్టర్!

జిల్లాస్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్రకు సంబంధించి 49 అవార్డులు జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఇదే విషయాన్ని కలెక్టర్ రాజాబాబు స్వయంగా ప్రకటించారు. అయితే జిల్లా స్థాయిలో స్వచ్ఛఆంధ్ర-స్వర్ణఆంధ్ర అవార్డులకు ఎంపికైన పంచాయతీలు, బస్టాండ్, ఇతర విభాగాలకు 6 తేదీన అవార్డులను ఆయా పంచాయతీలలో అందజేయనున్నారు. ఈ మేరకు ప్రకాశం కలెక్టర్ కార్యాలయం శనివారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది.
News October 4, 2025
నేడు ప్రకాశం జిల్లాకు మోస్తరు వర్షసూచన.!

ప్రకాశం జిల్లాలో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించగా, ప్రకాశంకు మాత్రం మోస్తారు వర్ష సూచన ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News October 4, 2025
వాహనమిత్ర స్కీమ్.. ప్రకాశంలో అర్హులు ఎంతమందంటే?

‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని CM రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. ప్రకాశం జిల్లాలో 12493 ఆటో డ్రైవర్లు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వీటిని పరిశీలించిన అధికారులు 11,356 అప్లికేషన్లను మంజూరు చేశారు. వీరి ఖాతాల్లో మొత్తం రూ.17కోట్ల 3లక్షల 40వేల నగదు జమ కానుంది. వివిధ కారణాల వల్ల పలువురిని తొలగించగా, మరికొన్ని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. అర్హత గలవారికి రేపు రూ.15 వేలు జమ కానుంది.