News October 4, 2025
ఈ యూట్యూబర్ ఆస్తి రూ.665 కోట్లు!

యూట్యూబ్ చాలామందిని కోటీశ్వరులను చేస్తోంది. కేవలం యూట్యూబ్ ద్వారానే కొందరు రూ.వందల కోట్లలో నికర ఆస్తిని కూడగట్టుకున్నారు. ‘MyJAR’ డేటా ప్రకారం ఇండియాలో రిచెస్ట్ యూట్యూబర్‌గా తన్మయ్ భాట్ (రూ.665 కోట్లు) నిలిచారు. ఆ తర్వాత టెక్నికల్ గురూజీ (రూ.356Cr), సమయ్ రైనా (₹140Cr), క్యారీమినాటీ (₹131Cr), BB కి వినెస్ (₹122Cr), అమిత్ భదానా (₹80Cr), ట్రిగ్గర్డ్ ఇన్సాన్ (₹65Cr), ధ్రువ్ రాఠీ (₹60Cr) ఉన్నారు.
Similar News
News October 5, 2025
పిల్లల ఆధార్‌లో ఫ్రీగా బయోమెట్రిక్ అప్‌డేషన్: UIDAI

పిల్లల ఆధార్‌లో మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు అయ్యే ఛార్జీలను ఏడాది పాటు రద్దు చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. 5-7, 15-17 ఏళ్ల వయసున్న పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. UIDAI రూల్ ప్రకారం పిల్లలకు ఐదేళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 15 ఏళ్లు వచ్చాక మరోసారి బయోమెట్రిక్స్, ఫొటో అప్‌డేషన్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.
News October 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 5, 2025
అక్టోబర్ 5: చరిత్రలో ఈరోజు

1911: నటి పసుపులేటి కన్నాంబ జననం (ఫొటోలో లెఫ్ట్)
1975: హాలీవుడ్ నటి కేట్ విన్‌స్లెట్ జననం
2001: ఖాదీ ఉద్యమ నాయకురాలు కల్లూరి తులశమ్మ మరణం
2011: యాపిల్ సంస్థ సహవ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ మరణం (ఫొటోలో రైట్)
1864: కలకత్తాలో సంభవించిన పెను తుఫానులో 60,000 మందికి పైగా మృతి
* ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం