News October 4, 2025

అమెరికాలో LBనగర్ యువకుడి మృతి.. CM దిగ్భ్రాంతి

image

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో LBనగర్ వాసి పోలే చంద్రశేఖర్ మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదనను కలిగించిందని CM రేవంత్ అన్నారు. ‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తాం’ అని CM ట్వీట్ చేశారు.

Similar News

News March 7, 2026

HYD: డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అలర్ట్.. వాళ్ల ఇళ్లు రద్దు !

image

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నా లేదా అద్దెకు ఇచ్చినా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. అక్రమంగా ఉంటున్న వారిని గుర్తించి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించింది. నోటీసులకు స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేసి, అర్హులైన ఇతరులకు ఆ ఇళ్లను కేటాయించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

News March 7, 2026

ఖాకీ కొలువుల కోసం DSNRలో భారీ ర్యాలీ!

image

పోలీస్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సహనం నశించింది. 20వేల పోస్టులతో వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 10న దిల్​సుఖ్​నగర్​లో భారీ ర్యాలీకి పోలీస్ నిరుద్యోగ JAC పిలుపునిచ్చింది. వయోపరిమితిని 35ఏళ్లకు పెంచాలని, జీవో46ను రద్దు చేయాలని శనివారం పోస్టర్ రిలీజ్ చేశారు. లాంగ్ జంప్ 3.8Mకు తగ్గించాలని కోరారు. సర్కారు కాలయాపన చేస్తే ఆక్రోశం తప్పదని ఆకాశ్, శంకర్ బృందం హెచ్చరించింది.

News March 7, 2026

HYD: అక్రమార్కుల ఆకలికి ‘కూలీ’ల బతుకు తెల్లారింది!

image

​టోలిచౌకిలో బిల్డింగ్ గోవా కూలీ ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన సిటీలో కలకలం రేపింది. కేవలం 3 అంతస్తులకే పర్మిషన్ ఉంటే, 6వ అంతస్తు వరకు స్లాబ్‌లు వేశారు. DECలోనే నోటీసులిచ్చామని ఆఫీసర్లు బుకాయిస్తున్నారు. ఇస్తే పని ఎలా సాగింది? మామూళ్ల మత్తులో ఉన్నారా? అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలోని కొందరు అధికారుల అండదండలతోనే అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.