News October 4, 2025

భూపాలపల్లి: ఈనెల 6న ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ఈనెల 6న(సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ప్రజావాణి రద్దు విషయాన్ని ప్రజలు గమనించి, సోమవారం ఐడీవోసీ కార్యాలయానికి ఫిర్యాదులు ఇవ్వడానికి రావొద్దని ఆయన సూచించారు. కాగా, సమస్యలు కలిగిన ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 19, 2026

జనగామ: అతివలకు అండగా పీఎంఎఫ్ఎంఈ

image

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం అతివలు స్వయం ఉపాధి మార్గాలను అనుసరించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి క్రమబద్ధీకరణ పరిశ్రమలను(పీఎంఎఫ్ఎంఈ) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జనగామ జిల్లాలో 700 యూనిట్ల లక్ష్యం కేటాయించగా ప్రస్తుతం 270 యూనిట్లు పూర్తి చేసినట్లు మహిళా సంఘం బాధ్యులు తెలిపారు.

News March 19, 2026

ఏఐ డీప్‌ఫేక్ వీడియోలపై ఢిల్లీ హైకోర్టుకు గంభీర్

image

టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు తన పేరు, ఫొటోలు, ఐడెంటిటీని ఆయుధాలుగా వాడుకుంటున్నారని, ఏఐ సాయంతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి పోస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. వాటి వల్ల తన పరువుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. తనపై పోస్టులు చేసిన ఖాతాలు, ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని, రూ.2.5కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.

News March 19, 2026

భూపాలపల్లిలో మొదలైన ఎండ తీవ్రత..!

image

భూపాలపల్లి జిల్లాలో భానుడు సెగలుకక్కాడు. సాయంత్రం నాలుగు గంటలు దాటినప్పటికీ 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ఎండ తీవ్రత కొనసాగింది. గడిచిన రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై, వాతావరణం కాస్త చల్లబడటంతో ఉపశమనం పొందిన పట్టణ ప్రజలు.. నేడు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.