News October 4, 2025
నాగార్జున పరిపక్వత లేకుండా మాట్లాడడం తగదు: మజ్జి

శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సిరిమానును తిలకించడానికి డిసిసిబిలో అవకాశం ఇవ్వాలని లేఖ రాయడంపై డిసిసిబి ఛైర్మన్ <<17906979>>కిమిడి నాగార్జున<<>> పరిపక్వత లేకుండా మాట్లాడారని జడ్పీ చైర్మన్ మజ్జిశ్రీనివాసరావు విమర్శించారు. శనివారం జిల్లా పరిషత్‌లో ఆయన మాట్లాడారు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు వచ్చే ప్రజాప్రతినిధులకు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
Similar News
News October 5, 2025
ఈ నెల 6న గ్రీవెన్స్ ఉండదు: కలెక్టర్

ఈనెల 6 వ తేదీన (సోమవారం) కలెక్టరేట్లో నిర్వహించాల్సిన పిజిఆర్ఎస్ (గ్రీవెన్స్) కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు విజయనగరం కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. ఆరోజు పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, విజయనగరం ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రకటించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ సూచించారు.
News October 4, 2025
VZM: డ్వాక్రా బజారులో రూ.12 కోట్ల వ్యాపారం

ఈ ఏడాది విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేష స్పందన వస్తోందని డీఆర్డీఏ పధక సంచాలకులు శ్రీనివాస్ పాణి అన్నారు. శుక్రవారం డ్వాక్రా బజారును పరిశీలించారు. గత ఏడాది రూ.8కోట్ల అమ్మకాలు జరగగా, ఈ సారి రూ. 12 కోట్ల వరకు అమ్మకాలు సాగే అవకాశం ఉందన్నారు. ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళ సంఘాలు పాల్గొన్నాయన్నారు.
News October 4, 2025
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశాం: హోం మంత్రి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశామని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. పట్టణంలోని ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మంచి కార్యక్రమాలను ఆమోదించడానికి సీఎం చంద్రబాబు ఎల్లపుడూ ముందుంటారన్నారు. సూపర్ సిక్స్ ఎప్పుడు అని విమర్శించే వారి కళ్ళు తెరిపించేలా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేయడం జరిగిందని తెలిపారు.