News October 4, 2025
ALERT: రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని 10 జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Similar News
News October 5, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం

TG: హైదరాబాద్‌లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News October 5, 2025
భారత్‌తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?

ఉమెన్స్ క్రికెట్ WCలో ఇవాళ INDతో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని PAK కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్‌పైనే’ అని స్పష్టం చేశారు.
News October 5, 2025
పిల్లల ఆధార్‌లో ఫ్రీగా బయోమెట్రిక్ అప్‌డేషన్: UIDAI

పిల్లల ఆధార్‌లో మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్‌కు అయ్యే ఛార్జీలను ఏడాది పాటు రద్దు చేస్తున్నట్లు UIDAI ప్రకటించింది. 5-7, 15-17 ఏళ్ల వయసున్న పిల్లలు ఉచితంగా బయోమెట్రిక్, ఐరిస్, ఫొటో అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 1 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. UIDAI రూల్ ప్రకారం పిల్లలకు ఐదేళ్ల వయసులో ఒకసారి, ఆ తర్వాత 15 ఏళ్లు వచ్చాక మరోసారి బయోమెట్రిక్స్, ఫొటో అప్‌డేషన్ తప్పనిసరి అన్న విషయం తెలిసిందే.