News October 4, 2025
గోదావరిఖని: కేంద్ర మంత్రిని కలిసిన రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి INTUC జాతీయ అధ్యక్షుడు Dr.సంజీవ రెడ్డితో కలిసి రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ శనివారం HYDలో కలిశారు. బొగ్గు గని కార్మికుల సంక్షేమం, JBCCIకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. JBCCIలో ఉన్న అన్ని కమిటీల్లో INTUC ప్రతినిధులను చేర్చాలని, దీంతో బొగ్గు గని కార్మికుల సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. దీనికి సానుకూలంగా స్పందించారని చెప్పారు.
Similar News
News October 5, 2025
వరంగల్: వేధిస్తే షీ టీంకు తెలియజేయండి!

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్ సిబ్బందికి షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని సూచించారు.
News October 5, 2025
రాబోయే 3 గంటల్లో వర్షం

TG: హైదరాబాద్‌లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
News October 5, 2025
సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం నిలిపివేత: కలెక్టర్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావాణి యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.