News October 4, 2025
దేశం మోదీ చేతుల్లో సురక్షితం: బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు

పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో జరిగిన బీజేపీ నేతల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డి ఈరోజు మాట్లాడారు. ప్రధాని మోదీ సాహసోపేత నిర్ణయాలతో దేశం శత్రుదేశాలకు తలవంచని శక్తిగా మారిందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుస్తామని, కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, బీజేపీ జెండా జిల్లాలో ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News April 1, 2026
పాలమూరు: నేటి నుంచి పోలీసు యాక్ట్

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.
News April 1, 2026
సిరిసిల్ల సిస్ కార్యాలయాన్ని ఓవర్సీస్ చేసుకున్న ఎన్పీడీసీఎల్

సిరిసిల్ల సెస్ కార్యాలయాల లైసెన్స్ మార్చి 31 వరకు ముగిసింది. దీనిపై NPDCL సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. లైసెన్స్ కాలం ముగిసినందున టి.జి.ఆర్.సీ ఆదేశాల ప్రకారం ఓవర్సీస్ చేసుకోవడం జరిగిందని, తర్వాత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం లైసెన్స్ ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుందన్నారు. వినియోగదారులు రైతులు, గృహ, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు ఉండవని అని అన్నారు.
News April 1, 2026
MBNR: NH-44.. డైవర్షన్‌లపై ఎస్పీ భద్రతా సూచనలు

రాజాపూర్ మండలం రాజాపూర్ టౌన్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారి–44పై కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు సంబంధించి రోడ్డు డైవర్షన్‌ల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ డి.జానకి కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారిపై వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో డైవర్షన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.


