News October 4, 2025

వెంకటాపూర్: 60 ఏళ్లుగా ఆ పార్టీ మద్దతుదారే సర్పంచ్..!

image

వెంకటాపూర్ మండలం రామానుజాపూర్ గ్రామ పంచాయతీకీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో నేటి వరకు కాంగ్రెస్ మద్దతుదారే సర్పంచ్‌గా గెలుపొందడం విశేషం. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎక్కువ మంది పోటీలో ఉండటం, సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఒక సామాజిక వర్గం కీలకంగా వ్యవహరించడం కారణమని స్థానికులు చెబుతున్నారు. సర్పంచ్ అభ్యర్థుల మధ్య పోటీ మాత్రం నువ్వా? నేనా? అన్నట్లు ఉంటుందని అంటున్నారు.

Similar News

News October 5, 2025

రాబోయే 3 గంటల్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

News October 5, 2025

సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం నిలిపివేత: కలెక్టర్

image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావాణి యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.

News October 5, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?

image

ఉమెన్స్ క్రికెట్ WCలో ఇవాళ INDతో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని PAK కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్‌పైనే’ అని స్పష్టం చేశారు.