News October 4, 2025
చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఎగ్జిబిషన్ సందర్శించిన కలెక్టర్

సూపర్ జీఎస్టి-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం అమలులో భాగంగా భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో చేనేత, టెక్స్టై టైల్స్, రెడీ మెడ్ ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా కొంత ప్రయోజనం ఉంటుందన్నారు.
Similar News
News March 20, 2026
గృహ గణనలో నిష్పాక్షికత: డీఆర్ఓ

భీమవరం కలెక్టరేట్‌లో గృహ గణనపై శుక్రవారం తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో డీఆర్ఓ శివన్నారాయణ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ.. గృహ గణన కార్యక్రమం విజయవంతంగా అమలు కావాలంటే ప్రాథమిక స్థాయి నుంచి పటిష్టమైన ఏర్పాట్లు అవసరమని తెలిపారు. గృహ గణన ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా, నిష్పాక్షికంగా సమాచార సేకరణ జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News March 19, 2026
ప.గో: 19 రోజుల తర్వాత స్వదేశానికి భౌతికకాయం

పాలకొల్లు డామ్ పేటకు చెందిన కందికట్ల రాకేష్ (26) ఈనెల 1 న కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో విమానాల రాకపోకలు లేకపోవడంతో కువైట్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచారు. ఇండియన్ ఎంబసీ చొరవతో పోస్ట్ మార్టం అనంతరం 19 రోజుల తర్వాత మృతదేహాన్ని గురువారం కార్గో విమానంలో హైదరాబాద్ తరలించనున్నారు. శుక్రవారం పాలకొల్లు చేరనుంది.
News March 19, 2026
భీమవరం కలెక్టరేట్‌లో వేడుకగా ‘ఉగాది’

భీమవరం కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక పూజలు చేసి, వేద పండితుల పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా ఆలకించారు. అనంతరం కవులను, పండితులను ఆమె ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓతో పాటు దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.


