News October 4, 2025
ములుగు: ఆ లీడర్ మళ్లీ వస్తున్నారా..?

ములుగుకు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అతను. అనూహ్యంగా పక్క నియోజకవర్గానికి వెళ్లాల్సి వచ్చినా గెలిచి సంచలనాన్ని మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో ఓడినా స్టేట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఏడేళ్లుగా సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆ లీడర్ మళ్లీ తిరిగి వస్తున్నారట. తన రీ ఎంట్రీపై ఇప్పటికే అభిమానులకు సందేశం పంపిన ఆయన లోకల్ బాడీ ఎన్నికల నుంచే బలప్రదర్శన చేస్తారనే చర్చ జోరందుకుంది.
Similar News
News October 5, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్‌గా వివేక్?

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి రోజుకో అప్‌డేట్ SMలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓ కీలక పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపిస్తారని సమాచారం. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే నెల 5 నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News October 5, 2025
సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం సహాయ కేంద్రం

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి 81253 52721 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.
News October 5, 2025
వరంగల్: వేధిస్తే షీ టీంకు తెలియజేయండి!

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్ సిబ్బందికి షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని సూచించారు.