News October 4, 2025
పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శం: మంత్రి తుమ్మల

దమ్మపేట మండలం లింగాలపల్లిలో జరిగిన తెలంగాణ పామాయిల్ రైతుల సమ్మేళనంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. పామాయిల్ సాగులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. సాంప్రదాయ పంటలైన పత్తి, మిర్చితో పోలిస్తే పామాయిల్ సాగు ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.
Similar News
News March 12, 2026
వరంగల్‌లో ఇక BRSకు రెండు సీట్లు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యపై స్పీకర్ క్లారిటీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్, జనగామలో BRS ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే. ఇటీవల ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ BRS తరఫున MLA వివేకానంద గౌడ్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ తుది తీర్పు ప్రకటిస్తూ, కడియం శ్రీహరి BRSలోనే ఉన్నారంటూ ప్రకటించడంతో ఆ పార్టీకి రెండు స్థానాలున్నట్లు తేలింది.
News March 12, 2026
NLG: మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రెండో విడతలో ఆర్టీసీ అద్దె బస్సుల పథకాన్ని అమలు చేయనుంది. త్వరలోనే నల్లగొండ రీజియన్ పరిధిలో బస్సుల పంపిణీకి మార్గదర్శకాలు రానున్నాయి. ఒక్కో జిల్లాకు 150 సంఘాలను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని జిల్లాల్లో బస్సులు కేటాయించారు.
News March 12, 2026
శ్రీకాకుళం: ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో ఆరుగురు డిబార్

శ్రీకాకుళం జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం స్క్వాడ్ పరిశీలనలో కాపీయింగ్ చేస్తున్న ఆరుగురిని డిబార్ చేసినట్లు డీఈవో ఎ.రవి బాబు చెప్పారు. 866 మంది విద్యార్థులకు 755 మంది హాజరు కాగా 111 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణను సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షిస్తున్నాయననారు.


