News October 4, 2025

పెట్రోల్ కొట్టిస్తున్నారా?.. ఇలా జరిగితే అంతే!

image

ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన E20 పెట్రోల్ చాలా బంకుల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పెట్రోల్ వాడే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా బంక్ యాజమాన్యాలు అవగాహన కల్పిస్తున్నాయి. ‘ఇథనాల్ నీటిని వేగంగా ఆకర్షిస్తుంది. వాషింగ్ & వర్షాల సమయంలో ట్యాంకులోకి నీరు చేరకుండా చూసుకోవాలి. నీరు తగిలితే ట్యాంకులో ఓ ప్రత్యేకమైన పొర ఏర్పడి వాహనం స్టార్ట్ కావడం కష్టతరమవుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.

Similar News

News March 22, 2026

‘పెద్ది’లో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే సాంగ్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా స్పెషల్ సాంగ్‌లో స్క్రీన్ షేర్ చేసుకుంటారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం మృణాల్ తెలుగులో అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్నారు.

News March 22, 2026

కొబ్బరి రేట్లు ఢమాల్

image

AP: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం అనేక రంగాలపై పడుతోంది. ఈ జాబితాలో కొబ్బరి కూడా చేరింది. నెల వ్యవధిలోనే వెయ్యి కాయల ధర ₹22K నుంచి ₹12K-13Kకు పడిపోయింది. రాష్ట్రంలో 2.7L ఎకరాల్లో కొబ్బరి సాగువుతుంది. ఇతర రాష్ట్రాల కొబ్బరిని గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తారు. యుద్ధం వల్ల ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోవడంతో ఆ కొబ్బరిని దేశీయంగా వినియోగిస్తున్నారు. దీంతో మన కొబ్బరికి గిరాకీ తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు.

News March 22, 2026

TDR పాలసీలో కీలక మార్పులు

image

TG: భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(TDR) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. 21mకు పైబడిన భవనాలను హై-రైజ్ భవనాలుగా గుర్తించనుంది. 750-2000చ.మీ ప్లాట్లలో 18-21m భవనాలకు TDR తప్పనిసరి చేసింది. నాన్ హై రైజ్ బిల్డింగ్స్‌కు సెట్ బ్యాక్ సడలించింది. హై రైజ్ భవనాల్లో 10% వరకు సెట్ బ్యాక్ రిలాక్షేషన్‌కు, 2000 చ.మీ ప్లాట్లలో అదనపు అంతస్తులకు అవకాశం కల్పించింది.