News October 4, 2025
ప్రతి భవాని భక్తుడికి 12 లడ్లు: EO

ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ప్రతి భవానీ భక్తుడికి 12 లడ్లు అందేలా ఈవో శీనా నాయక్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన స్వయంగా లడ్డూ తయారీ కేంద్రం, స్టాక్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులతో మాట్లాడి, ఆలయం అందిస్తున్న మెరుగైన సేవల గురించి వివరించారు. ఈవో ప్రత్యేక చొరవపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 17, 2026
సంక్షేమ వసతి గృహాలపై కృష్ణా కలెక్టర్ సమీక్ష

ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల మరమ్మతుల పురోగతిపై మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో సమీక్షించారు. 61 హాస్టళ్ల అభివృద్ధికి రూ.10.35 కోట్లు మంజూరు కాగా, రూ.5 కోట్లతో 46 హాస్టళ్లలో పనులు పూర్తయ్యాయన్నారు. తాగునీరు, ఆహార నాణ్యతపై రాజీ లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News March 17, 2026
NTR: బీ.టెక్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) పరిధిలో డిసెంబర్ 2025లో నిర్వహించిన III/IV బీ.టెక్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://nagarjunauniversity.ac.in/examcell/results ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.


