News October 4, 2025
దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి వస్తూ మృతి

సూర్యాపేట రూరల్ ఎర్కారం స్టేజ్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సూర్యాపేట వైపు వెళ్తున్న స్కూటీని అర్వపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలోస్కూటీపై ప్రయాణిస్తున్న సూర్యాపేట జిల్లా కేంద్రం సీతారాంపురం కాలనీకి చెందిన సారగండ్ల నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Similar News
News March 4, 2026
రేపు విశాఖలో పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

నరవ నుంచి వచ్చే ప్రధాన పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని ఈస్ట్, వెస్ట్, పెందుర్తి జోన్ల పరిధిలో తాగునీటి సరఫరా నిలిచిపోతుందని జీవీఎంసీ ఈఈ మురళీకృష్ణ తెలిపారు. లక్ష్మీ నగర్, జ్యోతి నగర్ ఏరియాల్లో లీకేజీలను అరికట్టేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, ప్రజలు సహకరించాలన్నారు.
News March 4, 2026
పెద్దపల్లి: ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలి: కలెక్టర్

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఉన్నత విద్య కొనసాగించాలని కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. బుధవారం ఆయన పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 – 27 సంవత్సరం ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్, నైపుణ్యాల ఆధారిత కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 4, 2026
సేంద్రియ ఉత్పత్తుల ఇమేజ్ పెంచాలి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ పెంచి ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం సేంద్రిక వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ విక్రయాలపై సమీక్షించారు. దళారీ వ్యవస్థ లేకుండా వినియోగదారులకు నేరుగా రైతులు తమ ఉత్పత్తులు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


