News October 4, 2025

కరీంనగర్: ‘రేపటి నుంచి నగరంలో దొంగ ఓట్లు వెలికితీస్తాం’

image

ఈనెల 17 వరకు ఓట్ చోరీపై రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతుందని, కరీంనగర్ నగరంలోని అన్ని డివిజన్లలో డివిజన్‌కు కనీసం వందకు తగ్గకుండా సంతకాలు చేపడతామని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఓట్ చోరీ జరుగుతుందని, మొన్న పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడికి ఆధారాలతో చూపించామని, రేపటి నుంచి డివిజన్లలో దొంగ ఓట్లను వెలికితీస్తామని తెలిపారు.

Similar News

News March 4, 2026

కరీంనగర్‌లొ కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం

image

కరీంనగర్ నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ కరీంనగర్లో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్టోస్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

News March 4, 2026

KNR: సోలార్ విద్యుత్‌‌పై అవగాహన వాహనం ప్రారంభం

image

‘ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే KNR కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. టీఎస్ రెడ్ కో ఆధ్వర్యంలో 99 రోజుల పాటు జిల్లాలోని 16 మండలాల్లో ఈ వాహనం పర్యటించనుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గృహ వినియోగదారులు ఇంటిపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని అన్నారు.

News March 4, 2026

KNR: ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో హోలీ సంబరాలు

image

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హోలీ పండుగ సందర్భంగా మహిళా విద్యార్థులతో సహజ రంగులతో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ హిత దృక్పథంతో, ఆరోగ్య రక్షణను ప్రధానంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ వేడుకలో రసాయనిక రంగులను పూర్తిగా నివారించి సహజ పూలు, ఔషధ గుణాలున్న వనరులతో రంగులను తయారు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డి.వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.