News October 4, 2025

తొలిసారి భారత్‌కు UK PM స్టార్మర్

image

యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్‌ స్టార్మర్ తొలిసారి భారత్‌కు రానున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఇదే ఆయన తొలి అధికారిక పర్యటన. ఈనెల 9న ఇద్దరు ప్రధానులు ముంబై వేదికగా భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరుపుతారు. ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కూ వీరిద్దరు హాజరుకానున్నారు.

Similar News

News October 5, 2025

ఈ 6 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలెక్కువ!

image

TG: రాష్ట్రంలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా వెల్లడించింది. 22,903 యాక్సిడెంట్లలో 7,660 మంది చనిపోయారని పేర్కొంది. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదంలో 75% మ.3 నుంచి రా.9 గంటల మధ్యే జరుగుతున్నాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా పేర్కొంది. 2023లో ఈ 6 గంటల వ్యవధిలో మొత్తం 8,775 యాక్సిడెంట్లు జరిగాయి.

News October 5, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్

image

2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ MLAలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ MLAలు BJPలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.

News October 5, 2025

IND వార్నింగ్.. పాక్ రిప్లై ఇదే!

image

ప్రపంచ పటం నుంచి లేపేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ ఆర్మీ స్పందించింది. ‘భారత నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమూ గట్టిగా స్పందిస్తాం. భారత్‌లోని ప్రతి మూలకు మా దళాలు వెళ్లగలవు. ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీయొచ్చు. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడం అనేది పరస్పరం ఉంటుంది’ అని హెచ్చరించింది.