News October 4, 2025
వరల్డ్ కప్ కొట్టడమే మా టార్గెట్: గిల్

భారత వన్డే టీమ్ కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు టార్గెట్ ఏంటో క్లియర్‌గా చెప్పేశారు. ‘ODI జట్టు సారథి కావడం అరుదైన గౌరవం. ఈ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలనని ఆశిస్తున్నా. 2027 వరల్డ్ కప్ కంటే ముందు 20 వన్డేలు ఆడాల్సి ఉంది. మా అంతిమ లక్ష్యం WC కొట్టడమే. దీనికోసమే కష్టపడతాం’ అని తెలిపారు. వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని BCCI కెప్టెన్సీని మార్చిందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు.
Similar News
News October 5, 2025
ఈ 6 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలెక్కువ!

TG: రాష్ట్రంలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా వెల్లడించింది. 22,903 యాక్సిడెంట్లలో 7,660 మంది చనిపోయారని పేర్కొంది. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదంలో 75% మ.3 నుంచి రా.9 గంటల మధ్యే జరుగుతున్నాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా పేర్కొంది. 2023లో ఈ 6 గంటల వ్యవధిలో మొత్తం 8,775 యాక్సిడెంట్లు జరిగాయి.
News October 5, 2025
కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్

2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ MLAలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ MLAలు BJPలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.
News October 5, 2025
IND వార్నింగ్.. పాక్ రిప్లై ఇదే!

ప్రపంచ పటం నుంచి లేపేస్తామని భారత ఆర్మీ చీఫ్ ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ ఆర్మీ స్పందించింది. ‘భారత నేతలు, ఆర్మీ అధికారులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పాక్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మేమూ గట్టిగా స్పందిస్తాం. భారత్‌లోని ప్రతి మూలకు మా దళాలు వెళ్లగలవు. ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరిగితే అది వినాశనానికి దారితీయొచ్చు. ప్రపంచ పటం నుంచి తుడిచిపెట్టడం అనేది పరస్పరం ఉంటుంది’ అని హెచ్చరించింది.