News October 4, 2025

బిగ్‌బాస్-9: ఈవారం ఎలిమినేట్ ఎవరంటే?

image

బిగ్‌బాస్ సీజన్-9 రసవత్తరంగా సాగుతోంది. ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజన, శ్రీజ, హరిత హరీశ్, దివ్య నామినేషన్‌లో ఉన్నారు. ఈ నాలుగో వారంలో దమ్ము శ్రీజ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆమె ఓటింగ్‌లో సేవ్ అయ్యారు. తక్కువ ఓటింగ్ పర్సంటేజ్‌తో మాస్క్ మ్యాన్ హరిత హరీశ్ ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ కానుంది. మోనార్క్‌లా వ్యవహరించడం, టాస్క్‌లు ఆడకపోవడమే హరీశ్‌‌కు మైనస్ అయింది.

Similar News

News October 5, 2025

టాలీవుడ్, బాలీవుడ్‌ మధ్య తేడా అదే: రాశీ ఖన్నా

image

టాలీవుడ్‌లో హీరోయిన్లను చాలా గౌరవిస్తారని రాశీ ఖన్నా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న తేడాపై ఆమె మాట్లాడారు. ‘తెలుగులో షూటింగ్ రోజూ 9 గంటలే ఉంటుంది. హిందీ, తమిళ ఇండస్ట్రీలో 12 గంటలు పని చేయాలి. దీంతో అలసిపోతాం. నన్ను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువ ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది.

News October 5, 2025

ఈ 6 గంటల్లోనే రోడ్డు ప్రమాదాలెక్కువ!

image

TG: రాష్ట్రంలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజాగా వెల్లడించింది. 22,903 యాక్సిడెంట్లలో 7,660 మంది చనిపోయారని పేర్కొంది. ఏటా నమోదవుతున్న రోడ్డు ప్రమాదంలో 75% మ.3 నుంచి రా.9 గంటల మధ్యే జరుగుతున్నాయని తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, నిర్లక్ష్యం ఈ ప్రమాదాలకు కారణాలుగా పేర్కొంది. 2023లో ఈ 6 గంటల వ్యవధిలో మొత్తం 8,775 యాక్సిడెంట్లు జరిగాయి.

News October 5, 2025

కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: కేజ్రీవాల్

image

2027 గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో తమకు పొత్తు ఉండదని AAP జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ‘గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ BJPకి MLAలను సరఫరా చేసే పార్టీగా మారింది. భవిష్యత్తులో తమ MLAలు ఎవరూ BJPలోకి వెళ్లరని ఓటర్లకు కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా? 2017-19 మధ్య 13 మంది, 2022లో 10 మంది కాంగ్రెస్ MLAలు BJPలో చేరారు’ అని గోవాలో జరిగిన పార్టీ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.