News October 5, 2025
నేటి ముఖ్యాంశాలు

* AP: ఆటో డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేలు జమ
* కూటమి నేతలతో కలిసే వెళ్లాలి: పవన్
* TG: బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్
* HYD, SEC పరిధిలో ఛార్జీలు పెంచిన TGSRTC
* అన్ క్లెయిమ్డ్ మొత్తం ₹1.84 లక్షల కోట్లు: నిర్మల
* ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన ప్రధాని మోదీ
* టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా గిల్
* తొలి టెస్టులో విండీస్‌పై భారత్ విజయం
Similar News
News October 5, 2025
610 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(OCT 7). బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీర్) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష బెంగళూరులో అక్టోబర్ 25, 26తేదీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. వెబ్‌సైట్: https://bel-india.in/
News October 5, 2025
గేదెను కొంటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి

గేదెను కొనుగోలు చేసేటప్పుడు అది ఎప్పుడు ఈనింది, ఎన్నవ ఈతలో ఉంది, ఈనిన తర్వాత ఎన్ని నెలలు పాడిలో ఉంది, కట్టినట్లయితే ఎన్ని నెలలు గర్భంలో ఉంది, వట్టి పోయి ఎంతకాలమైంది, ఈనడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే విషయాలను తప్పకుండా యజమానిని అడిగి తెలుసుకోవాలి. సంతలో పశువులను కొనుగోలు చేయాలనుకుంటే వాటికి రంగులు వేశారా? కొమ్ములు చెక్కారా? వంటివి గమనించి కొనాలి. పొదుగు జబ్బు వచ్చిన గేదెలు కొనకూడదు.
News October 5, 2025
సూర్య నమస్కారాలు చేస్తే చదవాల్సిన మంత్రాలు

ఓం మిత్రాయ నమః । ఓం రవయే నమః ।
ఓం సూర్యాయ నమః । ఓం భానవే నమః ।
ఓం ఖగాయ నమః । ఓం పూష్ణే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం మరీచయే నమః ।
ఓం ఆదిత్యాయ నమః । ఓం సవిత్రే నమః ।
ఓం అర్కాయ నమః । ఓం భాస్కరాయ నమః ।
శ్లోకం:
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥