News April 6, 2024
GOOD NEWS: పెన్షన్ల పంపిణీ గడువు 2 రోజులు పెంపు

AP: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ గడువును ఈ నెల 8 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించడంతో ఈ నెల 3వ తేదీ నుంచి 6 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవాళ్టితో దాదాపు 95 శాతం మందికి పంపిణీ పూర్తయ్యింది. ఇంకా మిగిలిన వారికోసం 2 రోజులు గడువు పొడిగించింది.
Similar News
News April 25, 2025
చదివి గెలిచింది.. కానీ అనారోగ్యం కబళించింది

AP: నంద్యాల జిల్లా దొర్నిపాడులో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. జెడ్పీ హైస్కూల్‌లో చదివి 557 మార్కులు సాధించిన సారా అనే బాలిక ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోయింది. తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ ఈ నెల 19వ తేదీనే మరణించింది. చనిపోయే ముందు కూడా తనకు 500పైనే మార్కులొస్తాయని చెప్పిందంటూ పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
News April 25, 2025
BREAKING: తప్పిన రైలు ప్రమాదం

తమిళనాడులోని అరక్కోణంలో పెను ప్రమాదం తప్పింది. రైల్వే పట్టాలపై దుండగులు బోల్టులు తప్పించారు. అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, కేరళ వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
News April 25, 2025
78వేల ఏళ్లైనా ఉగ్రవాదులు ఏం సాధించలేరు: గవాస్కర్

పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషించేవారిని ఒకటే అడుగుతున్నా. గడచిన 78 ఏళ్లుగా మీ పోరాటం ఏం సాధించింది? ఒక్క మిల్లీమీటర్ భూమైనా దక్కిందా? ఇంకో 78వేల ఏళ్లైనా మీరు సాధించేదేమీ లేదు. ఏమీ మారదు. మరి ఎందుకీ హింస? చక్కగా శాంతియుతంగా జీవిద్దాం’ అని సూచించారు.