News October 5, 2025
రాజమండ్రి: తిరుపతి విమాన సర్వీస్‌కు విశేష స్పందన

రాజమండ్రి నుంచి తిరుపతికి కొత్తగా ప్రారంభించిన విమాన సర్వీస్‌కు విశేష స్పందన లభించింది. తాజాగా వచ్చిన తిరుపతి సర్వీస్‌లో రెండు రోజుల్లోనే 211 మంది ప్రయాణించారు. మొదటి రోజు రాజమండ్రి నుంచి 66, రెండో రోజు 67 మంది వెళ్లగా.. తిరుపతి నుంచి మొదటి రోజు 38, రెండో రోజు 40 మంది ప్రయాణించినట్లు అలయన్స్ ఎయిర్‌లైన్స్ మేనేజర్ నరసింహారావు తెలిపారు.
Similar News
News March 13, 2026
రాజమండ్రి కల్తీ పాలు ఘటనలో 14కి చేరిన మృతుల సంఖ్య

రాజమండ్రిలో జరిగిన కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ మేరకు చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి(55) శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య అధికారి డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 14కి చేరింది. అయితే వైద్యులు రెడ్డి అనంత లక్ష్మికి చికిత్స అందించినప్పటికీ మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.
News March 13, 2026
రాజమండ్రిలో అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ హాల్ట్

చర్లపల్లి-కామాఖ్య అమృత భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు తూర్పుగోదావరి జిల్లా కనెక్టివిటీ లభించింది. ఈ రైలు శుక్రవారం మార్చి 13 నుంచి రాజమండ్రి స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి, విజయవాడ, రాజమండ్రి, భీమవరం, దువ్వాడ, విజయనగరం జంక్షన్ వంటి నగరాలను ఈ రైలు అనుసంధానిస్తోంది. దీనివల్ల జిల్లా ప్రజలకు రవాణా సౌకర్యం పెరగడంతో పాటు కామాఖ్య ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యం కలగనుంది.