News October 5, 2025
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి’

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాలని జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర సూచించారు. శనివారం విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. అరకు, అనంతగిరి హైడ్రో ప్రాజెక్టు వల్ల ఏజెన్సీ ముంపుకు గురవుతుందని జడ్పీటీసీ గంగరాజు ఆందోళన వ్యక్తం చేశారు. అనకాపల్లి జేసీ జాహ్నవి, జడ్పీ సీఈవో నారాయణమూర్తి పాల్గొన్నారు.
Similar News
News March 24, 2026
WGL: ఎన్నికలు ముగిశాయి.. డిపాజిట్లు వచ్చేదెన్నడు?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికలు ముగిసినా, అభ్యర్థుల డిపాజిట్ల విడుదలపై స్పష్టత కరువైంది. జిల్లా వ్యాప్తంగా 1684 పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన 26,071 మందిలో సుమారు 70 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకున్నారు. ఫలితాలు వచ్చి రోజులు గడుస్తున్నా, తమ నిధులు ఎప్పుడు తిరిగిస్తారా అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News March 24, 2026
కాసేపట్లో TTD దర్శన, వసతి టికెట్లు విడుదల

AP: తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులకు అలర్ట్. జూన్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు ఈరోజు 10AMకు విడుదల కానున్నాయి. అలాగే తిరుపతి, తిరుమలలో వసతి కోటా టికెట్లు కూడా ఈరోజు 3PMకు రిలీజ్ చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలోనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
News March 24, 2026
HYD: అందుకే మీకు నిద్ర పట్టనిది!

నగరవాసుల వర్క్ కల్చర్, అర్ధరాత్రి వరకు ఫోన్ వినియోగం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఉప్పల్‌కు చెందిన డా.రంజిత్ కుమార్ తెలిపారు. స్క్రీన్ టైమ్ పెరగడంతో నిద్రలేమి సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయని స్లీపింగ్ పాటర్న్‌పై నిర్వహించిన సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. రోజుకు 5 గం.కుపైగా స్క్రీన్ టైమ్ ఉన్నవారు నిద్ర సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. కొందరిలో నిద్ర నాణ్యత తగ్గుతోందని వివరించారు.


