News October 5, 2025

‘పూర్వోదయ స్కీమ్‌’ను సద్వినియోగం చేసుకోవాలి: CM

image

AP: కేంద్రం ప్రారంభించిన పూర్వోదయ స్కీమ్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని CM చంద్రబాబు అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూపొందించాల్సిన ప్రణాళికలపై సమీక్షించారు. ఉద్యాన పంటలు, ఫిషరీస్, ఆక్వా తదితర రంగాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లను ప్రోత్సహించాలని, సామూహిక పశువుల షెడ్ల నిర్వహణ బాధ్యతను డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పాలన్నారు.

Similar News

News October 5, 2025

ALERT.. భారీ వర్షాలు

image

TGలో రాబోయే 24 గంటల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ADB, ఆసిఫాబాద్, BHPL, PDPL, HNK, జనగామ, SDPT, MHBD, సూర్యాపేట, ఖమ్మం, WGL, భద్రాద్రి, మెదక్, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని శ్రీకాకుళం, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వానలు కురుస్తాయని APSDMA వెల్లడించింది.

News October 5, 2025

బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది: ట్రంప్

image

గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు US అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘బలగాల ఉపసంహరణపై పంపిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపితే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత మొదలవుతుంది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణకు నిబంధనలు సిద్ధం చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన చేయలేదు.

News October 5, 2025

ఈ నెల 9న OTTలోకి ‘వార్-2’!

image

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం బాలీవుడ్ సినిమాలు 8 వారాల్లో, టాలీవుడ్ మూవీలు 4 వారాల్లో OTTలో రిలీజ్ అవుతున్నాయి.