News October 5, 2025

భారత్‌తో మ్యాచ్.. పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?

image

ఉమెన్స్ క్రికెట్ WCలో ఇవాళ INDతో మ్యాచులో తమ ఆటతీరుపైనే ఫోకస్ పెడతామని PAK కెప్టెన్ ఫాతిమా సనా తెలిపారు. గతంలో ఇరు జట్ల ప్లేయర్లు ఫ్రెండ్లీగా ఫొటోలు దిగగా, ప్రస్తుత పరిస్థితులపై ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘అన్ని జట్ల ప్లేయర్లతో మాకు మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. అందరితో బాగుండేందుకు ప్రయత్నిస్తాం. గేమ్ స్పిరిట్‌కు అనుగుణంగా నడుచుకుంటాం. మా దృష్టంతా క్రికెట్‌పైనే’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 5, 2025

పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

image

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్‌ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

News October 5, 2025

హైదరాబాద్‌లో వర్షం

image

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, SR నగర్, ఫిలింనగర్‌, కుత్బుల్లాపూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సిటీలోని మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో వాన కురిసే అవకాశముందని ఇప్పటికే HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

News October 5, 2025

వన్డేల్లో కొనసాగడం ఇష్టం లేదా?

image

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని BCCI చెబుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ రంజీల్లో అడపాదడపా ఆడి తప్పుకున్నారు. మళ్లీ తిరిగి దేశవాళీ మ్యాచుల్లో ఆడతామన్న సంకేతాలివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి వన్డేల్లోనూ కొనసాగేందుకు ఆసక్తి లేదేమోనని సెలక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.