News October 5, 2025
సంగారెడ్డి: ప్రజావాణి కార్యక్రమం నిలిపివేత: కలెక్టర్

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజావాణి యథావిధిగా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు.
Similar News
News October 5, 2025
TTDలో త్వరలో కీలక మార్పులు..!

TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు, భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చిన్నపొరపాటు కూడా లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఈక్రమంలోనే త్వరలో మరికొన్ని మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్‌లో వీటిని వెల్లడించే అవకాశం ఉంది. తిరుమలలో ఏం మార్చాలో మీరు కామెంట్ చేయండి.
News October 5, 2025
అల్లూరి జిల్లాలో రేపటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో, మండల స్థాయి క్రీడా పోటీలను ఈనెల సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, షెటిల్, యోగా, చెస్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు లేపు యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పోటీల నిర్వహణకు మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్లను నియమించామన్నారు.
News October 5, 2025
NLG: ఫోన్లు ఎత్తని ఎక్సైజ్ అధికారులు!

జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వారికి కంప్లైంట్ ఇవ్వాలన్నా, వారి నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ప్రజలు వాపోతున్నారు.