News October 5, 2025

రాబోయే 3 గంటల్లో వర్షం

image

TG: హైదరాబాద్‌లో రాబోయే 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. వచ్చే 2-3 గంటల్లో భూపాలపల్లి, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Similar News

News October 5, 2025

వారంలోగా పత్తి కొనుగోళ్లు: తుమ్మల

image

TG: రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పత్తి కొనుగోళ్ల అంశంపై ఆయన సమీక్షించారు. ‘ఎలాగైనా వారంలోపు పత్తి కొనుగోళ్లు చేపట్టాలని మిల్లర్లకు సూచించాం. సోమవారం సీసీఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశమవుతాం. జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సీసీఐ టెండర్లలో పాల్గొనక ఏర్పడిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం’ అని తెలిపారు.

News October 5, 2025

నులిపురుగులతో కనకాంబరం పంటకు నష్టం

image

నులిపురుగులు కనకాంబరం మొక్కల వేర్లలోకి రంధ్రాలు చేసుకొని వెళ్లి వేర్లపై బొడిపెలను కలగజేస్తాయి. దీని వల్ల ఆకు ముడుచుకొని ఊదారంగుకు మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఫలితంగా పూల పరిమాణం, దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగుల వల్ల ఎండు తెగులు సోకే ప్రమాదం ఉంది. నులిపురుగుల నివారణ కోసం ఎకరాకు 200 కిలోల వేపపిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News October 5, 2025

పవర్‌గ్రిడ్‌లో 866 అప్రెంటిస్‌లు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

image

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 866 అప్రెంటిస్‌లకు దరఖాస్తు చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ITI, డిప్లొమా, డిగ్రీ, PG ఉత్తీర్ణులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, సివిల్, రాజ్‌భాష, ఎగ్జిక్యూటివ్ లా విభాగాల్లో APలో 34, TGలో 37 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. స్టైపెండ్ రూ.13,000 నుంచి రూ.17,500 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: powergrid.in