News October 5, 2025
వరంగల్‌లో కాంగ్రెస్ బాకీ కార్డుల ట్రెండ్

స్థానిక సంస్థల ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టడానికి బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని అడుగడుగునా సర్కారు వైఫల్యం చెందుతూ వస్తుందని ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ విడుదల చేశారు. ఒక్కో రైతుకు రూ.75,000, మహిళలకు రూ.44,000 ఇచ్చిన తర్వాతే కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగాలంటున్నారు.
Similar News
News March 20, 2026
నిజాంసాగర్ ఎకో-టూరిజం పనులపై కలెక్టర్ ఫోకస్

నిజాంసాగర్ వద్ద చేపడుతున్న ఎకో-టూరిజం ప్రాజెక్టు పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. కాటేజీలు, స్పా, యోగా సెంటర్, రెస్టారెంట్, బ్లాక్ పనులను తనిఖీ చేశారు. పనులు వేగవంతం చేసి వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు ఎంట్రీ ఆర్చ్‌కు స్థలం త్వరగా ఖరారు చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
News March 20, 2026
నిజాంసాగర్ ఎకో-టూరిజం పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

నిజాంసాగర్ పరిసరాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎకోటూరిజం ప్రాజెక్టు పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేలా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక ప్రాంతంగా నిజాంసాగర్ రూపురేఖలు మారనున్నాయని, పనులు త్వరగా పూర్తైతే పర్యాటకులకు అందుబాటులోకి వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు.
News March 20, 2026
అమెరికాకు షాక్.. కుప్పకూలిన 16 యుద్ధ విమానాలు

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటి వరకు 16 యుద్ధ విమానాలను కోల్పోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. వీటిలో పది MQ-9 రీపర్ డ్రోన్లు, మూడు F-15లు, రీఫ్యూయలింగ్ విమానం KC-135 ఉన్నాయని తెలిపింది. అలాగే సౌదీలోని ఓ అమెరికన్ వైమానిక స్థావరంలోని ఐదు KC-135లు డ్యామేజ్ అయ్యాయంది. వీటిలో కొన్ని ఇరాన్ కూల్చగా, మరికొన్ని ఫ్రెండ్లీ ఫైర్‌లో దాడికి గురయ్యాయని పేర్కొంది.


