News October 5, 2025

జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ సూచనలు

image

అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలతో SP జగదీశ్ సమావేశం నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సభలో విధుల్లో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పారదర్శకత, నిజాయితీ, నిష్పక్షపాతంతో ప్రజలకు సేవ చేయాలని అన్నారు.

Similar News

News March 12, 2026

అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.

News March 12, 2026

అనంతపురంలో YCP ఆవిర్భావ వేడుకలు

image

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా పార్టీ అడుగులు వేస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ 16వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News March 12, 2026

ప్రత్యేక అధికారులను నియమించనున్న జిల్లా కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో గ్రామపంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించే అధికారాన్ని కలెక్టర్ ఆనంద్‌కు కట్టబెడుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ 2 నాటికి ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్థానిక డీపీఓలు రూపొందించిన జాబితా మేరకు కలెక్టర్ అధికారులకు పంచాయతీల బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.