News October 5, 2025
సూర్యాపేట: పోలీస్ వాహన విడిభాగాలకు బహిరంగ వేలం

సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు చెందిన వాహనాలకు సంబంధించిన ఉపయోగించిన బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ కాలనీలోని పాత ఎస్పీ కార్యాలయంలో బహిరంగ వేలం పాట ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 8712686019 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 5, 2025
జగిత్యాల: బతుకమ్మ పండగలో కత్తులతో దాడి

రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌లో బతుకమ్మ వేడుకల వేళ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో బోదాసు సతీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
News October 5, 2025
జనగామ జిల్లా వ్యాప్తంగా 138.2 మీ.మీ వర్షపాతం

జనగామ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని పాలకుర్తిలో 35.4, ఘనపూర్ (స్టేషన్)లో 30.6, జఫర్‌గఢ్ 29.4, కొడకండ్ల 28.4, తరిగొప్పుల (6.2), నర్మెట్ట (3.4), జనగామ (3.0), రఘునాథపల్లి (1.8) చిల్పూర్ 0.0, బచ్చన్నపేట0.0, లింగలఘనపూర్ 0.0 మీ. మీ, దేవరుప్పుల 0.0 వర్షపాతం నమోదయిందన్నారు.
News October 5, 2025
ADB: కారు జోరు.. చేరికలతో గెలుస్తుందా పోరు

స్థానిక సంస్థల ఎన్నికలపై కారు పార్టీ జోరు పెంచింది. ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రచారం వేగవంతం చేసింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జోగు రామన్న పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. బోథ్‌లో MLA అనిల్ జాదవ్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ చేరికలపై దృష్టిసారించారు. ప్రత్యర్థి పార్టీల్లోని మెజార్టీ లీడర్లను చేర్చుకునేలా ముందుకెళ్తున్నారు.