News October 5, 2025

టాలీవుడ్, బాలీవుడ్‌ మధ్య తేడా అదే: రాశీ ఖన్నా

image

టాలీవుడ్‌లో హీరోయిన్లను చాలా గౌరవిస్తారని రాశీ ఖన్నా తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య ఉన్న తేడాపై ఆమె మాట్లాడారు. ‘తెలుగులో షూటింగ్ రోజూ 9 గంటలే ఉంటుంది. హిందీ, తమిళ ఇండస్ట్రీలో 12 గంటలు పని చేయాలి. దీంతో అలసిపోతాం. నన్ను అభిమానించే వారు తెలుగులోనే ఎక్కువ ఉన్నారు’ అని పేర్కొన్నారు. సిద్ధూ జొన్నలగడ్డతో కలిసి ఆమె నటించిన ‘తెలుసు కదా’ ఈ నెల 17న థియేటర్లలోకి రానుంది.

Similar News

News October 5, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 86 పోస్టులు

image

సంగారెడ్డిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL) 86 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 14లోగా అప్లై చేసుకోవచ్చు. ముందుగా ఈ నెల 10లోగా NATS పోర్టల్‌లో ఎన్‌రోలింగ్ కావాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9వేలు, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8వేలు అందజేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News October 5, 2025

ఒకప్పటి హీరోహీరోయిన్లు ఇప్పుడెలా ఉన్నారో చూడండి!

image

చెన్నైలో జరిగిన 80వ దశకం సినీ తారల రీయూనియన్లో స్టార్ నటీనటులు పాల్గొన్నారు. ఆనాటి హీరోలు, హీరోయిన్లంతా స్టైలిష్ ఔట్‌ఫిట్స్‌లో మెరిశారు. ఆరుపదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి Xలో షేర్ చేశారు. ‘80ల నాటి నా ప్రియమైన స్నేహితులను కలిసినప్పుడల్లా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ప్రతి సమావేశం మొదటిదానిలానే కొత్తగా అనిపిస్తుంది’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

News October 5, 2025

వంటింటి చిట్కాలు

image

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్‌ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్‌లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>