News October 5, 2025

PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తాం: మంత్రి సత్యకుమార్

image

AP: PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. SEP 28 నుంచి చేస్తున్న ఆందోళన విరమించి విధుల్లో చేరాలని కోరారు. శనివారం రాత్రి వైద్యారోగ్య అధికారులతో అత్యవసర సమావేశమైన ఆయన మాట్లాడారు. వైద్యుల డిమాండ్లపై CMతో చర్చిస్తానన్నారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తదితరాలపై చర్చించి, ప్రభుత్వానికి సిఫార‌సులు చేసేందుకు ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.

Similar News

News October 5, 2025

5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

image

<>DSSSB<<>> 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 9 నుంచి నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

News October 5, 2025

వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

image

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.

News October 5, 2025

బత్తాయిలో ‘తొడిమ కుళ్లు’ తెగులు లక్షణాలు

image

బత్తాయి తోటల్లో కాయ తయారయ్యే దశలో తొడిమ కుళ్లు తెగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. దీనినే వడప, బొడ్డుకుళ్లు తెగులు అని కూడా అంటారు. కాయ పక్వానికి రాకముందే చిన్న సైజులో ఉన్నప్పుడే తొడిమ నుంచి ఊడి రాలిపోవడం ఈ తెగులు ప్రధాన లక్షణం. కొమ్మ చివరి భాగాల్లో, అభివృద్ధి చెందుతున్న కాయ తొడిమలపై ఈ తెగులు ప్రభావం ఎక్కువ. చిన్న కాయలుగా ఉన్నప్పుడే రాలిపోవడం వల్ల దిగుబడి తగ్గి రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.