News October 5, 2025
నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూత

బాలీవుడ్ నటి సంధ్యా శాంతారామ్(94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ‘అమర్ భూపాలి’ అనే మరాఠీ మూవీతో తెరంగేట్రం చేసిన ఆమె ‘జనక్ జనక్ పాయల్ బాజే, స్త్రీ, పింజారా, నవరంగ్’ వంటి హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె భర్త శాంతారామ్ లెజెండరీ డైరెక్టర్, ప్రొడ్యూసర్‌గా పేరొందారు. దాదాసాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Similar News
News October 5, 2025
వారిని కఠినంగా శిక్షించాలి: KTR

మధ్యప్రదేశ్ చింద్వారాలో కోల్డ్రిఫ్ <<17918452>>దగ్గు మందు<<>> తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన ఘటనపై KTR దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా ఘోరం. ఈ మందు తయారు చేసిన కంపెనీ మేనేజ్మెంట్, దానిని అప్రూవ్ చేసిన అథారిటీలను కఠినంగా శిక్షించాలి. ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కారకులందరినీ జైలులో వేయాలి’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
News October 5, 2025
5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

<
News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.