News October 5, 2025
వికారాబాద్: స్థానిక ఎన్నికలు.. షెడ్యూల్ ప్రకారం జరిగేనా..?

ఎన్నికల సంఘం ఇటీవల స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఎన్నికలు అనుకున్న తేదీల్లో జరుగుతాయా లేదా అని అందరిలో సందేహం వచ్చింది. రిజర్వేషన్లను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం విచారణ జరిగే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులో ఈనెల 8న తీర్పు రాబోతోంది. వికారాబాద్ జిల్లాలోని అభ్యర్థులు ఎన్నికలు జరుగుతాయా లేదా, ప్రచారం చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు.
Similar News
News March 24, 2026
‘మన ఇసుక’ యాప్ ద్వారానే అనుమతులు: కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ జిల్లాలో ‘మన ఇసుక’ వాహనం యాప్ ద్వారానే ఇసుక అమ్మకాల అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంలో కూపన్లు జారీ చేయడం వల్ల ఇసుక విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. తహశీల్దార్లందరూ ఈ యాప్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
News March 24, 2026
NGKL: ఏప్రిల్ 1 నుంచి 3 వరకు సలేశ్వరం జాతర!

వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి 3 వరకు నిర్వహించనున్న సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, డీఎఫ్ఓ రేవంత్ చంద్రలతో కలిసి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, రవాణా, భద్రతా సౌకర్యాలు కల్పించాలని ఆలయ కమిటీకి సూచించారు.
News March 24, 2026
ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించిన SP

పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ జిల్లాలో విధులు నిర్వహిస్తూ ప్రతిభ కనబరిచిన పోలీసులను ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందించి ప్రోత్సహించారు. బాధితులకు న్యాయం జరిగినప్పుడే పోలీసు వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని.. ఆ దిశగా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించి అందరి మెప్పు పొందాలని సూచించారు.


