News October 5, 2025
ప్రధాని చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకున్న ముంచంగిపుట్టు విద్యార్థిని

ముంచంగిపుట్టు మండలం మాకవరం గ్రామానికి చెందిన పాంగి రామదాసు కుమార్తె మధులత చదువులో సత్తాచాటి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు పొందింది. మధులత కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో చదువుతూ ITI-R&AC ట్రేడ్ కోర్సులో 1,200 మార్కులకు గాను 1,194 మార్కులు సాధించింది. జాతీయ స్థాయిలో 28వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించింది. దీంతో శుక్రవారం ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందుకుంది.
Similar News
News March 22, 2026
జనసేన MLA బాలరాజుకు రూ.12లక్షలు టోకరా

AP: పోలవరం జనసేన MLA చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆర్టీఏ చలానా పేరుతో ఓ లింక్ పంపారు. దాన్ని క్లిక్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.12లక్షలను మాయం చేశారు. మోసపోయినట్లు గుర్తించిన MLA వెంటనే జీలుగుమల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక SMలో షేర్ అయ్యే APK ఫైళ్లు, లింక్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఇప్పటికే హెచ్చరించారు.
News March 22, 2026
KNR ఉమ్మడి జిల్లాలో నలుగురు మృతి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నిన్న నలుగురు మృతి చెందారు. కరీంనగర్ టూటౌన్ ఎస్సై <<19439698>>చంద్రశేఖర్<<>>, కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో <<19442320>>మధునయ్య<<>> ఆత్మహత్య చేసుకోగా, ధర్మపురి ఎస్సీకాలనీలో వివాహిత <<19444636>>రమ్యపై<<>> భర్త పెట్రోల్ పోసిన ఘటనలో రమ్య చికిత్స పొందుతూ మృతి చెందారు. శంకరపట్నం మండలం కేశవపట్నం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందింది.
News March 22, 2026
నిర్మల్: ప్రాజెక్టుల్లో నీరున్నా.. తీరని దాహం

జిల్లాలో ప్రజలను క్షేత్రస్థాయిలో నీటి కొరత వేధిస్తోంది. శ్రీరాంసాగర్, కడెం వంటి ప్రాజెక్టుల నుంచి నీటిని మళ్లించడంలో జరుగుతున్న జాప్యం వల్ల గిరిజన పల్లెలు, మారుమూల గ్రామాల్లో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. “నీరున్నా వాడుకోలేని పరిస్థితి” నెలకొందని బాధితులు వాపోతున్నారు. అందుబాటులో ఉన్న వనరులను ప్రతి ఇంటికీ, ప్రతి ఎకరానికి నీరు అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని విన్నవిస్తున్నారు.


