News October 5, 2025
సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై పోటీలు: డీఈవో

ఈనెల 7న జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ శనివారం తెలిపారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పోటీలు మంచి వేదికగా నిలుస్తాయని అన్నారు. వివరాలకు కర్నూల్–II సర్కిల్ (9000724191)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 12, 2026
ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.
News March 11, 2026
గ్యాస్ సిలిండర్ పేరుతో మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసే అవకాశాలున్నాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం హెచ్చరించారు. ప్రత్యేక ఆఫర్లు, వెంటనే బుకింగ్ చేయాలంటూ వచ్చే తప్పుడు సందేశాలను నమ్మవద్దన్నారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు ఉపయోగించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, ఓటీపీ లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని పేర్కొన్నారు.
News March 11, 2026
కర్నూలు జిల్లా రైతులకు తీపి కబురు

అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం కింద 2025-26 ఆర్థిక సహాయం ఈ నెల 13న విడుదల కానుందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. అర్హత కలిగిన రైతులకు రూ.6,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 2,72,757 మంది లబ్ధిదారులకు రూ.154.94 కోట్లు అందుతాయని జిల్లా వ్యవసాయ అధికారి వివరించారు. ఈ నిధులు డీబీటీ ద్వారా రైతుల ఖాతాలకు చేరుతాయి.


