News October 5, 2025

బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ ఒప్పుకుంది: ట్రంప్

image

గాజాలో తొలిదశ బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు US అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. ‘బలగాల ఉపసంహరణపై పంపిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపితే సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుంది. వెంటనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య బందీలు, ఖైదీల అప్పగింత మొదలవుతుంది. ఆ తర్వాత బలగాల ఉపసంహరణకు నిబంధనలు సిద్ధం చేస్తాం’ అని పేర్కొన్నారు. అయితే బలగాల ఉపసంహరణపై ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన చేయలేదు.

Similar News

News October 5, 2025

మహిళల్లో గుండెపోటు.. కారణాలివే!

image

ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. అయితే ఇటీవల మహిళల్లోనూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి అధిక బరువు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగ తాగడం, రుతుక్రమం ఆగడానికి మాత్రల వాడకం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు పైబడిన మహిళలు కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News October 5, 2025

మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

image

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.

News October 5, 2025

రోహిత్ శర్మ 45-77 ట్వీట్ వైరల్

image

13 ఏళ్ల కిందట హిట్‌మ్యాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. నిన్న రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ గిల్‌ను IND వన్డే సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా 45 శకం ముగిసిందని, 77 జర్నీ మొదలైనట్లు రోహిత్ 2012లో ట్వీట్ చేశారు. రోహిత్ జెర్సీ నంబర్ 45 కాగా, గిల్‌ది 77. అయితే ఆ సమయంలో రోహిత్ ఎందుకలా ట్వీట్ చేశారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.