News October 5, 2025

భద్రాచలం: 73 ఏళ్లకు 4 స్వర్ణాలు

image

భద్రాచలానికి చెందిన క్రీడాకారుడు శంకర్ రావు 73 ఏళ్లలో అద్భుత ఘనత సాధించారు. ఇటీవల కేరళలో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆయన ఏకంగా 4 బంగారు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పారు. బైపాస్ సర్జరీని సైతం లెక్కచేయకుండా ఆయన ఈ విజయాలు సాధించడం విశేషం. బెస్ట్ ఆఫ్ ఇండియా అధికారికంగా గుర్తించిన రికార్డు పత్రాలను ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా శంకర్ అందుకున్నారు.

Similar News

News March 13, 2026

తిరుపతిలో చిన్నారి మృతిపై కలకలం

image

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శిశువు మృతి కలకలం రేపింది. నగరంలోని చెన్నారెడ్డి కాలనీ చెందిన జానకి 3రోజుల క్రితం పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. ఈక్రమంలో బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన బిడ్డకు గురువారం రాత్రి టీకా వేశారని.. శరీరం నీలి రంగుగా మారి చనిపోయినట్లు తల్లి ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృత శిశువుతో ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

News March 13, 2026

KNR: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న వేర్వేరు ప్రాంతాల్లో ఐదుగురు మృతి చెందారు. జమ్మికుంటలోని ఆర్‌వోబీ ఫ్లైఓవర్‌పై నుంచి దూకి <<19365742>>రాం శివరాజ్<<>>(28), ధర్మారం(M) నర్సింహులపల్లికి చెందిన <<19364283>>శంకరయ్య<<>>(73), కోనాయిపల్లి శివారులో <<19367858>>రాజూరి వీరాచారి<<>>(40), జమ్మికుంటకు చెందిన <<19367714>> కర్రయ్య<<>>లు ఉరి వేసుకొని, మంథని మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<19368176>>గోబు తిరుపతి<<>>(30) మృతి చెందారు.

News March 13, 2026

బాపట్ల: టెన్త్ విద్యార్థులకు గమనిక

image

​పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని బాపట్ల DEO శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునేందుకు విద్యార్థులు ఇబ్బంది పడకుండా హాల్‌టికెట్లపై (QR) కోడ్‌ను అందిస్తున్నామన్నారు. మొబైల్‌లో దీన్ని స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం చిరునామా, రూట్ మ్యాప్, పాఠశాల చిత్రం కనిపిస్తాయని పేర్కొన్నారు.