News October 5, 2025

రేపటి నుంచి అనకాపల్లి-తిరుపతి ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల సౌకర్యార్థం అనకాపల్లి-తిరుపతికి ఈనెల 6వ తేదీ నుంచి వారానికి ఒకరోజు ప్రత్యేక ట్రైన్ నడపనున్నట్లు అనకాపల్లి రైల్వే స్టేషన్ మేనేజర్ సచ్చి నివాస్ తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయలుదేరి ఎలమంచిలి మీదుగా.. 6వ తేదీ ఉదయం 9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి తిరుపతి వెళ్తుందన్నారు.

Similar News

News March 5, 2026

రుణ లక్ష్యాలను వంద శాతం సాధించాలి: కలెక్టర్

image

జిల్లాలోని స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన బ్యాంకు లింకేజి రుణ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వంద శాతం సాధించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో స్త్రీ నిధి రుణాలు, యూనిట్ల స్థాపనపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇప్పటివరకు రూ.1242.48 కోట్లు మంజూరయ్యాయన్నారు. మిగిలిన రుణాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News March 5, 2026

GNT: ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్

image

ఈ నెల 14న జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నీ న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ బెంచెస్ ఏర్పాటు చేశామని‌, సివిల్ కేసులు, క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, చెక్ బౌన్స్, LOAP కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కక్షిదారులు, స్టేక్హోల్డర్స్, పోలీసులు కేసుల పరిష్కారానికి సహకరించాలన్నారు.

News March 5, 2026

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శానిటేషన్‌లో మెరుగుపడితే అవార్డులు వస్తాయని సూచించారు.