News October 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 26

image

1. రాముడు ఏ వంశానికి చెందినవాడు?
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ఎవరు?
3. విష్ణువు కాపలదారులు ఎవరు?
4. కార్తికేయ స్వామికి ఎన్ని తలలుంటాయి?
5. హనుమాన్ చాలీసా రచయిత ఎవరు?
– సరైన సమాధానాలు సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#IthihasaluQuiz<<>>

Similar News

News October 5, 2025

భగవంతుడు అవతారాలు ఎందుకెత్తాడు?

image

నిర్గుణంచేంద్రియాతీతం, నిరాకారం నిరంజనం |
స్వభక్త రక్షణార్థాయ, జాయతేహి యుగేయుగే ||
పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతామ్ |
ధర్మసంస్థాపనార్థాయ, సంభవామి యుగేయుగే ||
భగవంతుడు గుణములు, ఇంద్రియాలు లేనివాడు. నిరాకారుడు. నిరంజనుడు. అయినా తన భక్తులకు కాపాడుకోవడానికి సిద్ధపడతాడు. సజ్జనులను రక్షించాలని, దుష్టులను శిక్షించాలని, ధర్మమును కాపాడాలని అవతారాలు ఎత్తాడు. <<-se>>#WhoIsGod<<>>

News October 5, 2025

మహిళల్లో గుండెపోటు.. కారణాలివే!

image

ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల పురుషులతో పోల్చితే మహిళల్లో గుండెపోటు మరణాలు తక్కువ. అయితే ఇటీవల మహిళల్లోనూ ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి అధిక బరువు, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, పొగ తాగడం, రుతుక్రమం ఆగడానికి మాత్రల వాడకం వంటివి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు. 35ఏళ్లు పైబడిన మహిళలు కొన్ని కచ్చితమైన వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

News October 5, 2025

మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

image

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.