News October 5, 2025

HYD- బెంగుళూరు వెళ్తున్న ఫ్లైట్‌లో సాంకేతిక లోపం

image

HYD నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX-1072 సాంకేతిక లోపంతో ఆలస్యం అయింది. మొదట బే నం.57L వద్ద లోపం తలెత్తగా, తర్వాత బే నం.45కు మార్చి సాయంత్రం 6:24కు విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్‌లో 166 మంది ప్రయాణికులు, అందులో పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఉన్నారు.

Similar News

News October 5, 2025

HYD: 7న HCU 25వ స్నాతకోత్సవం

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 7న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నారు. స్నాతకోత్సవంలో 1,717 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం, 182 మంది ప్రతిభ చాటిన విద్యార్థులకు మెడల్స్, 242 మందికి PHD డిగ్రీలు అందించేందుకు ఏర్పాటు చేశారు.

News October 5, 2025

కాంగ్రెస్ షేక్‌పేట్ ఇన్‌ఛార్జ్‌గా అందె మోహన్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని షేక్‌పేట ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ అందె మోహన్ అన్నారు. ఈ ఎన్నికలో భాగంగా షేక్‌పేట కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన భుజస్కందాలపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.

News October 5, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో మిగిలింది ముగ్గురే?

image

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థుల జాబీతాలో నవీన్‌యాదవ్‌, మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు షార్ట్‌లిస్ట్‌‌ను ఫైనల్ చేశారు. అనంతరం స్క్రీనింగ్‌ కమిటీకి ఈ లిస్ట్‌ను TPCC పంపనుంది. త్వరలోనే అభ్యర్థిని హైకమాండ్ ఫైనల్ చేయనుంది. దీంతో జాబ్లీ హైడ్రామాలో కొత్త అభ్యర్థుల పేర్లతో మరో మలుపు తీసుకుంది.