News October 5, 2025

అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ఆడనున్న కోటబొమ్మాళి యువకుడు

image

కోటబొమ్మాళికి చెందిన ఈశ్వర్ రెడ్డి అంతర్జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అవకాశం దక్కింది. సెప్టెంబర్ 9-14 వరకు ఒడిశాలో జరిగిన జాతీయ T10 టెన్నిస్ క్రికెట్ పోటీల్లో ఆల్ రౌండర్‌గా సత్తా చాటాడు. ఈ మేరకు డిసెంబర్ 25-31 వరకు థాయిలాండ్‌లో జరగనున్న సెకండ్ ఏషియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాలని ఇండియా సెలక్షన్ టీం సెక్రటరీ నుంచి ఇవాళ లేఖ అందిందని క్రీడాకారుడు చెప్పారు.

Similar News

News October 4, 2025

నాగవళి నదిలో రైతు గల్లంతు

image

ఆమదాలవలస మండలం కనుగులవలసకు చెందిన రైతు నారాయుడు (64) నాగావళి నదిలో శనివారం ప్రమాదవశాత్తూ జారిపడి గల్లంతయ్యారు. దూసి గ్రామం సమీపంలోని పంట పొలాలకు యూరియా జల్లి సమీపంలోని నాగావళి నదిలో చేతులు శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో జారి పడి కేకలు వేయగా అప్రమత్తమైన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే కొట్టుకుపోయాడు. అతని ఆచూకీ ఇప్పటికి లభ్యం కాలేదు.

News October 4, 2025

శ్రీకాకుళం జిల్లాలో 13,887 మందికి రూ.15 వేల సాయం

image

ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున నగదును వారి అకౌంట్లలో నేడు జమ చేయనుంది. ఈ వాహన మిత్ర పథకానికి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 15,341 మంది ఆటో డ్రైవర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 13,887 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి కోసం మొత్తం రూ.21 కోట్ల మేర ప్రభుత్వం నిధులను మంజూరు చేయనుంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారందరికీ నేడు నగదును జమ సీఎం చంద్రబాబు చేయనున్నారు.

News October 4, 2025

హిరమండలం: గొట్టా బ్యారేజీ వద్ద తగ్గిన వరద ఉద్ధృతి

image

హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజ్‌లో వరద నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 75 వేల క్యూసెక్కులకు ఉన్న వరద నీరు శనివారం ఉదయం 6 గంటలకు 50 వేల క్యూసెక్కులకు చేరుకుందని డీఈ సరస్వతి తెలిపారు. 2, 3వ ప్రమాద సూచికలు తొలగించామని, ఒకటవ ప్రమాద సూచిక కొనసాగుతుందని ఆమె వివరించారు.