News October 5, 2025
రేపు మిర్యాలగూడలో బాక్సింగ్ ఎంపికలు

ఉమ్మడి నల్గొండ జిల్లాస్థాయి బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు సోమవారం మిర్యాలగూడలో జరగనున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGF) ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌పీ మైదానంలో ఉదయం 9 గంటలకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ సెక్రటరీ డి.విమల తెలిపారు. 14 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలు అర్హులని, పూర్తి వివరాలకు 97032 69840 నంబర్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు.
Similar News
News March 25, 2026
నల్గొండ అసెంబ్లీ స్థానం రెండుగా విభజన?

ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. NLG అసెంబ్లీ నియోజకవర్గాన్ని రెండుగా విడగొట్టి, కొత్తగా ‘ NLG అర్బన్’ పేరుతో మరో స్థానాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. పెరుగుతున్న జనాభా రీత్యా NLG పట్టణాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
News March 25, 2026
చీమకుర్తి: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

చీమకుర్తి మండలంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోనేపల్లివారిపాలేనికి చెందిన అంజలి(21) గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఈక్రమంలో అతని పొలం వద్దే ఆమె ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 25, 2026
నిజామాబాదు: ఇంటర్ తర్వాత ఏ కోర్సు మేలు?

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 35 వేల మంది విద్యార్థులు తమ తదుపరి అడుగుల కోసం సిద్ధమవుతున్నారు. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఎంపీసీ విద్యార్థులు ఏఐ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండగా, బైపీసీ విద్యార్థులు అగ్రి బిఎస్సీ, ఫార్మసీ వంటి రంగాలను ఎంచుకోవడం ఉత్తమం. కామర్స్ వాళ్లు సీఏ, బీబీఏ కోర్సులు ఉపాధిని ఇస్తాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ముందుకెళ్లాలి.


