News October 5, 2025
సంగారెడ్డి: ‘12 మంది నోడల్ అధికారుల నియామకం’

స్థానిక సంస్థల ఎన్నికల కోసం 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకటేశ్వర్లకు సిబ్బంది నియామకం, అఖిలేశ్ రెడ్డికి బ్యాలెట్ బాక్సులు, అరుణకు రవాణా, రామాచారికి శిక్షణ కార్యక్రమాలు, స్వప్నకు సామగ్రి పంపిణీ, జగదీశ్‌కు ఎన్నికల ప్రవర్తన నియమావళి, బలరాంకు వ్యయ పరిశీలన, సూర్యారావుకు రిపోర్టుల పరిశీలన, బాలరాజుకు బ్యాలెట్, పోస్టల్ పేపర్ల ముద్రణ అప్పగించారు.
Similar News
News March 13, 2026
విజయవాడలో ప్రమాదం.. MBBS విద్యార్థి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ మెడికల్ కళాశాల విద్యార్థి లిఖిత్ సాయి (MBBS) దుర్మరణం చెందారు. శ్రీకాళహస్తికి చెందిన ఆయన గురువారం రాత్రి రామవరప్పాడు నుంచి వస్తుండగా, పరిణయ కళ్యాణ మండపం వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 13, 2026
సిద్దిపేట: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

28న సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి సూచించారు. జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎక్సైజ్, మోటార్ వాహనాల కేసులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. లోక్ అదాలత్‌లో క్రిమినల్, కంపౌండ్డబుల్, సివిల్, చెక్ బౌన్స్ కేసుల్లో రాజీ కుదుర్చుకోవాలని, ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే కంటే లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవాలన్నారు.
News March 13, 2026
KMR: ఇంటర్ పరీక్షలు.. 97.46% హాజరు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్ ద్వితీయ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,649 మంది విద్యార్థులకు గాను 7,455 మంది హాజరయ్యారని, 194 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 97.46 శాతం హాజరు నమోదైందని ఆయన వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.


