News October 5, 2025
దండేపల్లి: దండారి ఉత్సవాలు.. గిరిజన కళల మేళా

దండేపల్లి మండలంలోని గుడి రేవు గ్రామ పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉన్న “పద్మల్ పూరి కోక “ఆలయం గుస్సాడీ, దండారి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ప్రతి ఏటా దసరా నుంచి దీపావళి వరకు ఈ గుస్సాడీ ఉత్సవాలు కొనసాగుతాయి. ఈ దండారి ఉత్సవాలకు తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి గిరిజనులు పెద్ద ఎత్తున తరలివస్తారు. పద్మల పూరి కోక ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉత్సవాలు దీపావళి అమావాస్యతో ముగుస్తాయి.
Similar News
News March 20, 2026
ఆదివాసీ గూడాలల్లో తాగునీటి బోర్లు, బావులు : మంత్రి సీతక్క

మిషన్ భగీరథ వ్యవస్థ అందుబాటులోకి రాని మారుమూల ఆదివాసీ గూడాలల్లో తక్షణమే మంచినీటి బావులు, బోర్లను నిర్మించాలని మంత్రి సీతక్క అన్నారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారంపై సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డితో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకంలో కుంటలను తవ్వించి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. పైప్ లైన్లకు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు.
News March 20, 2026
KMR: నెలవంక దర్శనం.. రేపే ఈద్-ఉల్-ఫితర్

ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగకు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వడంతో శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోనున్నారు. నెలవంక కనిపించిన వెంటనే ఒకరికొకరు ఈద్ కా చాంద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా నెల రోజులుగా ముస్లింలు పాటిస్తున్న కఠిన ఉపవాస దీక్షలు నేటితో ముగిశాయి.
News March 20, 2026
సిరిసిల్ల: 4 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది

యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో యాసంగి సీజన్ కొనుగోళ్లపై అధికారులు,రైస్ మిల్లర్లు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు జిల్లాలో 2,70,000 నుంచి 3 లక్షల మెట్రిక్ నెల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొత్తం 240 కొనుగోలు కేంద్రాలు ఉంటాయన్నారు.


