News October 5, 2025
16న శ్రీశైలానికి మోదీ.. కీలక ప్రతిపాదనలు!

AP: ప్రధాని మోదీ ఈ నెల 16న శ్రీశైల మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకోనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. వాటికి రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, Dy.CM సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉంది. ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, నూ క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 5, 2026
ఖలిస్థానీ విమర్శకురాలు, యూట్యూబర్ దారుణ హత్య

ఖలిస్థానీ విమర్శకురాలు, పంజాబ్ సంతతికి చెందిన యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్(45) కెనడాలో దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. SMలో యాక్టివ్‌గా ఉండే నాన్సీ ఖలిస్థానీ కార్యకలాపాలను విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేసేవారు. తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కామెంట్లనూ ఖండించేవారు. ఆమె హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 5, 2026
30 రోజుల వరకే గ్యాస్ నిల్వలు.. ధరలు పెరిగే ఛాన్స్!

LNG ఉత్పత్తిని ఖతర్ నిలిపివేయడం, హార్ముజ్ జలసంధిలో రాకపోకలు ఆగిపోవడం వల్ల ఇండియాపై ప్రభావం పడనుంది. ప్రస్తుతం దేశంలో 30 రోజులకు సరిపడా LPG స్టాక్ మాత్రమే ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘LPG అవసరాలలో 80-85% దిగుమతి చేసుకుంటున్నాం. ఇందులో ఎక్కువ వాటా గల్ఫ్‌దే. మనకు ప్రత్యామ్నాయ సరఫరాదారులూ లేరు. ఈ నెల రావాల్సిన గ్యాస్ ఆలస్యమైతే ఇబ్బందులు తప్పవు. రేట్లు పెరిగే అవకాశం ఉంది’ అని పేర్కొన్నాయి.
News March 5, 2026
ఖమేనీ మృతిపై సంతాపం తెలిపిన భారత్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఆయన మరణానికి సంతాపం తెలియజేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్వయంగా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి రాయబారులతో మాట్లాడారు. అక్కడ సంతాప సందేశ బుక్‌పై సంతకం చేశారు. కాగా ఖమేనీ మృతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.


